Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పాన్ ఇండియా యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ నేడు (జూన్ 4, 2026) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ దగ్గర ఊరమాస్ జాతరను సృష్టిస్తోంది. మార్నింగ్ షోల నుంచే ఈ సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో మెగా అభిమానులు థియేటర్ల వద్ద పూనకాలతో ఊగిపోతున్నారు. ఈ అఖండ విజయంపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అత్యంత భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం తాను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నప్పటికీ, తన మనసంతా ‘పెద్ది’ విజయం దగ్గరే ఉందంటూ చిత్ర యూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.
రామ్ చరణ్ నటన, సినిమా పట్ల తను చూపించిన అంకితభావాన్ని కొనియాడుతూ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. “గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ నేను దగ్గరుండి చూశాను. ‘పెద్ది’ పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ వెండితెరపై ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన అసలైన ప్రతిఫలమే ఈ రోజు ప్రేక్షకులు అందిస్తున్న ఈ అఖండ విజయం. చరణ్‌కు దక్కుతున్న ఈ అపారమైన ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా నాకు ఎంతో గర్వంగా అనిపిస్తోంది” అని చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగమైన నటీనటులు – సాంకేతిక నిపుణులను చిరంజీవి పేరుపేరునా అభినందించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన జాన్వీ కపూర్, కీలక పాత్రలు పోషించిన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ గారికి, అలాగే జగపతిబాబును ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. ఇలాంటి ఒక అద్భుతమైన కథను రాసి.. అంతే అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించినందుకు దర్శకుడు బుచ్చిబాబు సానాకు మెగాస్టార్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
Also Read
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
- Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
Congratulations to our #PEDDI, my dear @AlwaysRamCharan and the entire cast & crew on this incredible blockbuster! 💐💐💐
నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది.
గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ… pic.twitter.com/gZwN99aERV
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 4, 2026
తాజావార్తలు
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav vs Ishan: క్రెడిట్ అంతా తీసుకున్నావ్.. వైభవ్ భవిష్యత్ కెప్టెన్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
-
S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
-
CSK New Coach: సీఎస్కే కొత్త కోచ్.. ఎంఎస్ ధోనీ రెండు కీలక షరతులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!