గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు మెగాస్టార్ చిరంజీవి. “అనితర సాధ్యుడు, మహా గాయకుడు, ప్రియ సోదరుడైన బాలు గారికి ఓ చెల్లి అశ్రు నీరాజనం..మనందరినీ శోక సముద్రంలో ముంచి ఇంత త్వరగా వీడి వెళ్లిన ఆ గాన గంధర్వుడి 75 వ జన్మ దిన సంధర్బంగా ఈ స్మృత్యంజలి..వినమ్ర నివాళి !” అంటూ ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో బాలు పిక్స్ ఉండగా… ఎస్పీ వసంత పాడిన సాంగ్ విన్పిస్తోంది. కాగా బాలసుబ్రహ్మణ్యం ఆకస్మిక మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. అయన లేని లోటు ఎప్పటికి తీర్చ లేనిది. ఎస్పీ బాలు జయంతి సందర్బంగా యావత్ తెలుగు చిత్రసీమ ఆయనకు ట్రిబ్యూట్ అందిస్తుంది. జూన్ 4న ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ”ఎస్పీ బాలుకు స్వరనీరాజనం” కార్యక్రమం ‘ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్’ యూట్యూబ్ ఛానల్, ‘సంతోషం సురేష్’ యూట్యూబ్ ఛానెల్స్ లో 12 గంటల పాటు లైవ్ ప్రోగ్రామ్ కంటిన్యూ గా ప్రసారం అవుతుంది. ఆయనను గుర్తు చేసుకుంటూ టాలీవుడ్ మొత్తం కలిసి బాలు గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ .. ఈ గొప్ప కార్యక్రమం చేపట్టారు.
గాన గంధర్వుడికి స్మృత్యంజలి… వినమ్ర నివాళి : చిరంజీవి
