Chiranjeevi – Odela Movie Update: మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఒక సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే గత కొంత కాలంగా ఈ సినిమాపై పలు రకాల వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తన ఫస్ట్ సినిమా ‘దసరా’తోనే దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ఓదెల.. ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నానితో ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఓ భారీ ప్రాజెక్ట్‌ను కూడా ప్రకటించారు. అయితే ‘ది ప్యారడైజ్’ పనుల్లో శ్రీకాంత్ ఓదెల బిజీగా ఉండటంతో చిరంజీవి సినిమా ఆలస్యమవుతోందని, చివరకు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ ఇటీవల కాలంలో జోరుగా ప్రచారం జరిగింది. దర్శకుడు కథ చెప్పడం లేదని అందుకే మెగాస్టార్ ఈ సినిమాను క్యాన్సిల్ చేశారంటూ కూడా పుకార్లు షికార్లు చేశాయి.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శ్రీకాంత్ ఓదెల చేసిన పోస్ట్‌తో ఈ రూమర్స్‌కు చెక్ పడినట్లైంది. చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. ఆయనతో సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌తో చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల సినిమా ఆగిపోలేదనే విషయం స్పష్టమైంది. ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’తో బిజీగా ఉన్న శ్రీకాంత్ ఓదెల.. ఆ సినిమా పూర్తయిన తర్వాత చిరంజీవి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ మెగా ప్రాజెక్ట్ పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్నట్లు గతంలో నిర్మాత సుధాకర్ చెరుకూరి వెల్లడించారు. 1970ల నేపథ్యంలో, ముఖ్యంగా 1974-75 తర్వాత జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ రూపొందనుందని సమాచారం. గతంలో విడుదలైన ఈ సినిమా లుక్స్‌లో చిరంజీవి చేతులకు రక్తం కనిపించడంతో.. సినిమా రా అండ్ రస్టిక్ యాక్షన్‌తో పాటు భారీ బ్లడ్ బాత్ తరహాలో ఉండబోతుందనే అంచనాలు నెలకొన్నాయి. ఈ మెగా మూవీని న్యాచురల్ స్టార్ నాని సమర్పిస్తున్నారు. ‘దసరా’తో రా అండ్ రస్టిక్ మేకింగ్‌ను చూపించిన శ్రీకాంత్ ఓదెల.. ఇప్పుడు ప్యారడైజ్ తర్వాత చేయబోతున్న సినిమాలో మెగాస్టార్‌ను ఎలాంటి పాత్రలో చూపించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వినిపిస్తున్న అప్‌డేట్స్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదని, సరైన సమయంలో సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉందని తాజా పోస్ట్‌తో క్లారిటీ వచ్చినట్లే.
Happy Birthday, “T-REX” Megastar Chiranjeevi Sir ❤️
Waiting eagerly to start our film’s shoot and create a lifetime of unforgettable memories with you, Boss Sir ❤️@KChiruTweets sir 🤗❤️ pic.twitter.com/MhxiC3DqYk
— Srikanth Odela (@odela_srikanth) August 22, 2026

