NTV Telugu Site icon

ఎన్టీఆర్ కు చిరు పరామర్శ

కరోనా పాజిటీవ్ లో హోమ్ క్వారంటైన్ లో ఉన్నాడు నందమూరి తారకరామారావు. ఈ రోజు ఎన్టీఆర్ ను ఫోన్ లో పరామర్శించారు మెగాస్టార్ చిరంజీవి. ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. ‘కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. తను తన ఫ్యామిలీ మొత్తం బాగుంది. తారక్ ఉత్సాహంగా, ఎనర్జిటిక్ గా ఉన్నారని తెలుసుకుని సంతోషిస్తున్నాను. త్వరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు చిరంజీవి. చిరంజీవి తమ హీరోని పరామర్శించటం పట్ల తారక్ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.