Site icon NTV Telugu

Chiranjeevi: నేవీ డే సందర్భంగా అభిమానులకు మెగాస్టార్ సూపర్ గిఫ్ట్

Chiru

Chiru

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నేవీ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆసక్తికర ఫొటో షేర్ చేశారు. కానీ ఆ ఫొటో ఇప్పటిది కాదు.. తను కాలేజీ రోజుల్లో చదువుకునే రోజుల్లోది. అందులో ఆయన నేవీ క్యాడెట్ యూనిఫాంలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన.. గోవా ఎయిర్ పోర్టులో గతవారం తనను కొందరు నేవీ ఆఫీసర్లు కలిశారని చిరంజీవి వెల్లడించారు. దాంతో తనకు పాతరోజులు గుర్తుకువచ్చాయని పేర్కొన్నారు. తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఎన్ సీసీలో నావల్ క్యాడెట్ గా ఉన్నానంటూ వివరించారు. కాగా, తనకు క్రమశిక్షణ అలవడిందంటే అందుకు కారణం ఎన్ సీసీ అని చిరంజీవి గతంలోనూ చెప్పారు. ఎన్ సీసీలో ఉన్నప్పుడు 1976 రిపబ్లిక్ డే సందర్భంగా ఏపీ తరఫున రాజభవన్‎లో మార్చ్ పాస్ట్‎లో పాల్గొన్నానని వెల్లడించారు. ఇటీవల వైఎన్ఎమ్ కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న చిరంజీవి ఈ సంగతులు పంచుకున్నారు.

Exit mobile version