ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవికి అవార్డును ప్రదానం చేశారు. అతిరథ మహారథులు హాజరైన ఈ వేడుక కన్నుల పండగలా జరిగింది. ఇక ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ తెలుగులో ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఓ నానుడి ఉంది. నా విషయంలో రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట గెలిచాను ఏమో అనిపిస్తోంది. సినిమా పరిశ్రమలో నేను తొలుత రచ్చ గెలిచాను. నా ఇల్లు అనుకునే పరిశ్రమలో నాకు ఆ అవకాశం టాలీవుడ్ వజ్రోత్సవాల సమయంలో వచ్చింది. లెజండరీ పురస్కారం ప్రదానం చేశారు. ఆ సమయంలో చాలా ఆనందమేసి ధన్యుణ్ని అనుకున్నా. కానీ ఆ రోజు కొన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కొందరు హర్షించని ఆ సమయంలో ఆ పురస్కారాన్ని తీసుకోవడం సముచితం అనిపించలేదు.
Dulquer Salmaan: తెలుగులో ఈ హీరోలతో దుల్కర్ సల్మాన్ మల్టీస్టారర్?
అందుకే ఆ రోజు ఆ అవార్డుని ఓ క్యాప్సుల్ బాక్స్‌లో పడేసి నాకు అర్హత ఎప్పుడు వస్తుందో అప్పుడు తీసుకుంటాను అని చెప్పాను. అంటే ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈ రోజు ది గ్రేట్ ఏఎన్నార్ అవార్డును ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ గారి చేతులు మీదగా అందుకున్న రోజున ఇప్పుడు అనిపిస్తోంది.. ‘నేను ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను’ అని. అందుకే ఈ పురస్కారం గురించి చెప్పడానికి నాగార్జున, వెంకట్ ఇంటికి వచ్చినప్పుడు నేను చాలా ఆనందించాను. నాకు పద్మభూషణ్, పద్మ విభూషణ్, గిన్నిస్ బుక్‌లో స్థానం.. ఇలాంటివి ఎన్ని వచ్చినా ఈ అవార్డు విషయంలో నా భావోద్వేగం వేరుగా ఉంది. నా వాళ్లు నన్ను గుర్తించి నాకు అవార్డు ఇస్తుండటం నాకు గొప్ప విషయంగా అనిపించింది. అందుకే నాగార్జునతో ఇది నాకు అన్ని పురస్కారాలకు మించిన ప్రత్యేకమైన అవార్డు అని చెప్పా, ఇదే మాట స్టేజీ మీద చెప్పాలి అనుకున్నాను. ఇప్పుడు చెప్పాను అని ఆయన అన్నారు.