NTV Telugu Site icon

Megastar : భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతిపై చిరంజీవి సంతాపం

Chiru

Chiru

భారత మాజీ ప్రధాని,కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ ఈ గురువారం తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మన్మోహన్‌ సింగ్‌ మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘మన దేశం ఇప్పటివరకు సృష్టించిన గొప్ప రాజనీతిజ్ఞులలో ఒకరు, ఉన్నత విద్యావంతులు, మృదుస్వభావి మరియు వినయపూర్వకమైన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ. ఆర్థిక మంత్రిగా ఆయన విజన్ దేశ ఆర్థికస్థితిని మార్చివేసింది. వరుసగా రెండు పర్యాయాలు భారతదేశానికి 13వ ప్రధానమంత్రిగా అత్యంత విజయవంతమైన పదవీకాలం చరిత్రలో నిలిచిపోతుంది. ఆయన లాంటి మహానుభావుడి హయాంలో పార్లమెంటు సభ్యుడిగా, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన నుండి ఎంతో ప్రేరణ పొందాను అలాగే ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన మృతి మన దేశానికి తీరని నష్టం. ఆయన కుటుంబ సభ్యులకు మరియు ఆయన ప్రతి ఒక్కరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.ఓం శాంతి