మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై మరోసారి ఫిర్యాదు చేశారు. తనపై అభ్యంతరకర పోస్టులు పెడుతూ, దుర్భాషలాడుతున్న కొన్ని ‘X’ హ్యాండిల్ ప్రొఫైల్స్‌ను జతచేస్తూ ఆయన తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్, వ్యక్తిగత దూషణలకు సంబంధించి గతంలో సిటీ సివిల్ కోర్ట్ అనుకూలంగా తీర్పు ఇచ్చినా, ఇంకా కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వల్గర్ కామెంట్స్ చేస్తున్నారని చిరంజీవి ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read:Khawaja Asif: ‘కాబూల్.. ఢిల్లీ చేతిలో కీలుబొమ్మ’.. పాక్ మంత్రి ఆసిఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ తనపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. చిరంజీవి తన ఫిర్యాదులో, దయా చౌదరి అనే వ్యక్తి చేసిన కొన్ని అభ్యంతరకర వాక్యాలను కూడా ప్రత్యేకంగా జోడించినట్లు తెలుస్తోంది. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
Also Read:Cyclone Montha : మాస్ జాతర’కి తుఫాన్ టెన్షన్
సోషల్ మీడియాలో తనపై వ్యక్తిగత దూషణలు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిరంజీవి చేసిన ఈ ఫిర్యాదు ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసులు ఐటీ చట్టం (IT Act) మరియు భారతీయ న్యాయ సంహిత కింద పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఫిర్యాదులో పేర్కొన్న ‘X’ హ్యాండిల్స్ మరియు డీప్‌ఫేక్ వీడియోలు/వెబ్‌లింక్‌ల మూలాలను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ వీడియోలు/కామెంట్స్ వెనుక ఏదైనా వ్యవస్థీకృత కుట్ర దాగి ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో పాటు, డీప్‌ఫేక్ కంటెంట్ వ్యాప్తికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
