Site icon NTV Telugu

Chiranjeevi Fans: బాలయ్య కామెంట్స్.. తదుపరి కార్యాచరణకి చిరు ఫ్యాన్స్?

Chiranjeevi Birthday 2025

Chiranjeevi Birthday 2025

బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశించిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆదివారం ఉదయం 10 గంటలకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో మెగాస్టార్ చిరంజీవి అభిమానుల సంఘం సమావేశమయ్యేందుకు సిద్ధమవుతోంది. అఖిల భారత చిరంజీవి యువత సంఘ ముందుగా బాలకృష్ణను బహిరంగ క్షమాపణ చెప్పమని డిమాండ్ చేసింది. ఈ వివాదం ఏపీ అసెంబ్లీలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఏర్పడింది.

Also Read:OG : పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్ ఊరుకోరని తెలుసు.. సుజీత్ కామెంట్స్

ఏపీ అసెంబ్లీ సమావేశంలో, హిందూపూర్ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు నందమూరి బాలకృష్ణ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలిసీలను విమర్శిస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా, కామినేని శ్రీనివాసరావు చిరంజీవిని ప్రశంసిస్తూ జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు విడుదల చేసినప్పుడు, బాలకృష్ణ తన ప్రతిస్పందనలో చిరంజీవి గురించి వ్యంగ్యంగా మాట్లాడారు. వెంటనే, విదేశాల్లో ఉన్న చిరంజీవి ఒక ప్రెస్ నోట్ జారీ చేసి తన స్పందన తెలిపారు. “నేను ఎప్పుడూ మ్యూచువల్ రెస్పెక్ట్‌తో మాట్లాడతాను, ఇది నా సహజ అలవాటు. బాలకృష్ణ వ్యాఖ్యలు సార్కాస్టిక్‌గా ఉన్నాయి” అని చెప్పారు.

Also Read:Allu Sirish: పెళ్లికి సిద్ధమైన అల్లు శిరీష్.. అమ్మాయి ఎవరంటే?

చిరంజీవి అభిమానులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకుని, బాలకృష్ణను బహిరంగ క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తున్నారు. అఖిల భారత చిరంజీవి యువత సంఘం, “అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్‌ను అవమానించిన బాలకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలి. చేయకపోతే ప్రొటెస్టులు చేస్తాము” అని హెచ్చరించింది. చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. ఆదివారం ఉదయం 10 గంటలకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో జరిగే సమావేశంలో ఈ విషయంపై చర్చించి, నిరసనలకి సిద్ధమవుతున్నారు అని తెలుస్తోంది.

Exit mobile version