Site icon NTV Telugu

Akhila Bharatha Chiranjeevi Yuvatha: అధికార మదం తలకెక్కింది.. బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి!

Chiranjeevi Vs Balakrishna

Chiranjeevi Vs Balakrishna

నందమూరి బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి అని అఖిల భారత చిరంజీవి యువత డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి వ్యంగంగా మాట్లాడిన నందమూరి బాలకృష్ణ వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, తనను తాను అతీత శక్తిగా భావించుకుంటూ నందమూరి బాలకృష్ణ మెగా కుటుంబంపై గతంలో కూడా అనేక సార్లు అవమానకరంగా మాట్లాడటం జరిగింది. వివాదాలకు దూరంగా ఉండే మా చిరంజీవి ఎప్పుడూ వాటిపై స్పందించలేదు. అభిమానులుగా మేము కూడా ఆయన మనసెరిగి సంయమనం పాటించాము. బాలకృష్ణ కుటుంబం తీవ్ర వేధింపులకు గురై, జైలు పాలైనప్పుడు అండగా నిలుచుందీ… ఆయన కుటుంబం అధికారంలోకి రావడానికి అహర్నిశలూ కృషి చేసింది మెగా కుటుంబమే అన్న విజ్ఞత మరిచి, అధికార మదం తలకెక్కించుకున్న బాలకృష్ణ నేడు చట్టసభల్లో సైతం చిరంజీవి ప్రతిష్టను దిగజార్చేవిధంగా మాట్లాడేందుకు తెగించారు.

Ameesha Patel : చాలా మందితో డేటింగ్ చేశా.. అది నచ్చలేదు

ఈ వ్యాఖ్యలు మా దైవం చిరంజీవిని సైతం బాధించాయని ఆయన ప్రతిస్పందన ద్వారా అర్ధమవుతోంది. మెగా కుటుంబం అండగా నిలవకపోయుంటే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒక్కసారి ఊహించుకుంటే మంచిదని హితవు పలుకుతున్నాం. మరోసారి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే మెగా అభిమానుల తీవ్ర ఆగ్రహాన్ని చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంటుందని విన్నవిస్తున్నాం. చిరంజీవి అభిమానులుగా మేము సైతం బాలకృష్ణ వైఖరిని, వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే బాలకృష్ణ స్పందించి, బహిరంగ క్షమాపణలు తెలపాలని డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల బాలకృష్ణ ప్రజాక్షేత్రంలో తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం అని అఖిల భారత చిరంజీవి యువత హెచ్చరించింది.

Exit mobile version