మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లో 1 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు. మెగా అభిమానులు సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటూ మెగాస్టార్ ను తరచూ ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. చిరంజీవి గత ఏడాది మార్చి 25న ఉగాది శుభ దినాన ట్విట్టర్‌లోకి అడుగుపెట్టారు. వాస్తవానికి ట్విట్టర్‌లో చేరిన రెండు రోజుల్లోనే మెగాస్టార్ ట్విట్టర్ ఖాతాను చాలామంది ఫాలోవర్స్ ఫాలో అయ్యారు. ప్రస్తుతం చిరంజీవి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించాలని, కరోనా వచ్చినా భయపడకుండా జాగ్రత్తలతో పాటు తగిన చికిత్స తీసుకోవాలంటూ జనాలకు అవగాహన కన్పిస్తున్నారు. ఇక మెగాస్టార్ కు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్నారు. ‘ఆచార్య’ తర్వాత ‘లూసిఫర్’ రీమేక్, ‘వేదాళం’ రీమేక్ లలో కూడా నటిస్తున్నారు.
మెగాస్టార్ కు ట్విట్టర్ లో 1 మిలియన్ ఫాలోవర్స్
