Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి – బాబి కొత్త సినిమా ఓపెనింగ్‌కు అతిథులుగా ఆ ఇద్దరూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega158 Launch: ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబి కాంబినేషన్లో తెరకెక్కబోయే సరికొత్త చిత్రం గ్రాండ్ ఓపెనింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ సినిమా ముహూర్తపు పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు చిత్రబృందం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెగాస్టార్ సోదరుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరుకానున్నారు. ఒకే వేదికపై మెగాస్టార్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌లను చూడబోతుండటంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ప్రముఖ నిర్మాణ సంస్థ కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం కానుంది. ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు మేకర్స్ తెలిపారు. డైరెక్టర్ బాబి తన మార్క్ మాస్ ఎలిమెంట్స్, ఎమోషన్స్‌తో చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సినిమా ఓపెనింగ్ షాట్‌కు పవన్ కళ్యాణ్ క్లాప్ కొడతారా, చరణ్ కెమెరా స్విచ్చాన్ చేస్తారా అనే ఆసక్తికర విశేషాలు మరికొద్ది గంటల్లో అధికారికంగా వెలువడనున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
మెగాస్టార్ చిరంజీవి బాబి సినిమా ఓపెనింగ్ కి సర్వం సిద్ధం
ముహూర్తం పూజకు ముఖ్య అతిథులుగా హాజరుకానున్న మెగాస్టార్ సోదరుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ
కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్న బాబి… pic.twitter.com/dHFv7IyN6K
— NTV Breaking News (@NTVJustIn) May 21, 2026
తాజావార్తలు
-
Schools Holiday: భారీ వర్షాలతో అతలాకుతలం.. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
-
Xi Jinping Arrives in America: అమెరికా గడ్డపై షీ జిన్‌పింగ్.. ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మరీ స్వాగతించిన ట్రంప్
-
Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
-
Astrology: సెప్టెంబర్ 24 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!