మెగాస్టార్ చిరంజీవి – కమర్షియల్ హిట్‌లలో దిట్ట అయిన అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా షూటింగ్ వేగంగా ముందుకు సాగుతోంది. నయనతార ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ కాంబినేషన్ పై అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మనకు తెలిసి అనిల్ రావిపూడి సినిమాలు అంటే ప్రేక్షకులలో ఓ ప్రత్యేకమైన ఆసక్తి. ఎందుకంటే ఆయన స్టైల్లో ఉండే వినూత్న ప్రచార కార్యక్రమాలు సినిమాకు మరింత హైప్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చిరంజీవితో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ విషయంలో అయితే ఈ ప్రమోషన్‌కి మరింత వెయిట్ కలిగింది. సినిమా షూటింగ్ దశలోనే నయనతార క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఇక తాజాగా..
Also Read : Vidya Balan: అది మానేశాకే బరువు తగ్గా..
ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరో స్పెషల్ సర్ప్రైజ్ బయటకు వచ్చింది. ప్రముఖ ఛానల్ జీ తెలుగు లో ప్రసారమయ్యే ఓ ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవి ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ త్వరలోనే టెలికాస్ట్ కానుండగా, ఇప్పటికే రిలీజైన ప్రోమో వైరల్‌గా మారింది. అసలే బుల్లితెర ప్రేక్షకులకి చిరంజీవి ప్రత్యక్షంగా కనిపించడం అంటేనే పండుగ లాంటిది. దీంతో మెగా అభిమానులు, టీవీ వీక్షకులు ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాని డిజైన్ చేయడంలో అనిల్ రావిపూడి ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో కంటెంట్‌ను టార్గెట్‌డ్ ప్రోమోషన్ రూపంలో వదులుతూ, సినిమా మీద బజ్‌ను నెమ్మదిగా పెంచుతున్నాడు. ఇది థియేటర్‌ల వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టేందుకు ఉపయోగపడేలా ఉన్నది.
