ప్రముఖ సింగర్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ చిన్మయి పలు వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. మీటూ ఉద్యమంలో భాగంగా ప్రముఖ కోలీవుడ్ లిరిసిస్ట్ వైరాముత్తుపై లైంగిక ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి ఏ అమ్మాయికి లైంగికి వేధింపులు ఎదురైనా సోషల్ మీడియా ద్వారా తన గళం విన్పిస్తోంది. అయితే తాజాగా ఈ టాలెంటెడ్ సింగర్ ప్రెగ్నెన్సీ అంటూ ఓ పిక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ రూమర్స్ పై స్పందించిన చిన్మయి తాను ప్రెగ్నెన్సీ కాదని స్పష్టం చేసింది. ఆ పిక్ తన పెళ్ళికి సంబంధించినదని, ఆ చీరకట్టు అలాగే ఉంటుందని చెప్పుకొచ్చింది.
Read Also : అప్పుడే మొదలెట్టేసిన మెగా అభిమానులు…!!
కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో చిన్మయి “బేబీ బంప్” అంటూ ఆ పిక్ ను పోస్ట్ చేస్తున్నారని, కానీ అందులో ఏమాత్రం నిజం లేదని వెల్లడించింది. అంతేకాకుండా తాను సోషల్ మీడియాలో సమస్యలపై మాత్రమే స్పందిస్తానని, తన వ్యక్తిగత విషయాలు, సన్నిహితుల గురించి అస్సలు షేర్ చేయనని స్పష్టం చేసింది. సమయం వచ్చినప్పుడు నేను నా గర్భధారణకు సంబంధించిన విషయం పంచుకోకపోవచ్చు లేదా చెప్పకపోవచ్చు. అది నా నిర్ణయం. నా వ్యక్తిగత విషయం. మేము 100% పిల్లల ఫోటోలను ఎప్పుడూ సోషల్ మీడియాలో పంచుకోము. వారు సోషల్ మీడియాలో ఉండరు. ఈ వార్తలతో అలసిపోయాను. దయచేసి ఆపండి అంటూ చిన్మయి సుదీర్ఘ పోస్ట్ చేసింది. దీంతో ఆమె ప్రెగ్నన్సీ వార్తలకు చెక్ పడినట్లయింది.
