NTV Telugu Site icon

Allu Arjun : అల్లు అర్జున్ అరెస్ట్, నాన్ బెయిలబుల్ కేసు నమోదు

Allu Arjun No Bail

Allu Arjun No Bail

పుష్ప -2 సినిమా ప్రీమియర్స్ రోజు సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్  చేశారు చిక్కడపల్లి పోలీసులు. ఈ ఘటనలో ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయగా ఇప్పుడు సినీనటుడు అల్లు అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుష్ప 2 బెనిఫిట్‌ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అయితే అనుమతులు లేకుండా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లాడని పోలీసులు బన్నీపై కేసు నమోదు చేసారు. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించాడు  హీరో అల్లు అర్జున్‌, సంధ్య థియేటర్ ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని పిటీషన్‌ దాఖలు చేసారు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌ను నిందితుడిగా చేర్చారు  పోలీసులు. తనపై నమోదైన కేసులో కొట్టేయాలని పిటీషన్‌ దాఖలు చేయగా న్యాయస్థానం తీర్పు వెలువడించలేదు. ఈ లోగానే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. బన్నీ అరెస్ట్  వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా సంచలనం రేగింది. కాగా అల్లు అర్జున్ పై మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా 5 లేదా 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.