బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక నటించిన ‘ఛావా’ చిత్రం గతనెలలో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకువచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ సంచలన విజయం నమోదు చేసింది. మహారాష్ట్ర వీరుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఛావాను రూపొందించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ ముందు నుండే బుకింగ్స్‌లో ఈ చిత్రం రికార్డు సృష్టించింది. అందుకుతగ్గట్టే ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
Also Read : Tollywood : నిర్మాతలకు గుదిబండలా మారుతున్న డాన్సర్లు
కాగా ఈ సూపర్ హిట్ సినిమాను తెలుగులోకి తీసుకువచ్చింది గీతా ఆర్ట్స్. ఈ నెల 7 న రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు డబ్బింగ్ వర్షన్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించిన దాని కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబెట్టింది. తొలి రోజు ఈ సినిమా రూ. 3.03 కోట్లు కొల్లగొట్టి అద్భుతమైన స్టార్ట్ అందుకుంది. ఇక వారాంతమైన శని, ఆదివారం భారీ కలెక్షన్స్ రాబట్టింది. మొదటి వీకెండ్ ముగిసేనాటికి మొదటి మూడు రోజులకు గాను రూ. 9.46 కోట్లు కలెక్ట్ చేసింది. మరో విశేషం ఏంటంటే ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన స్ట్రయిట్ తెలుగు సినిమాల కంటే కూడా ఛావా ఎక్కువ వాసులు చేయడం విశేషం. సిటీస్ లోనే కాకుండా బీ, సీ సెంటర్స్ లోను ఈ బాలీవుడ్ సినిమా అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది.ఇక ఈ సినిమాకు పోటీలో మరే ఇతర సినిమాలు లేకపోడంతోలాంగ్ రన్ ఉండే అవకాశం ఉంది.