NTV Telugu Site icon

విజయ్ దేవరకొండకు మహేష్, ఛార్మి బర్త్ డే విషెస్

Charmme and Mahesh Babu Birth Day wishes to Vijay Devarakonda

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులతో పాటు సెలెబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా విజయ్ దేవరకొండకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ. మీకు విజయం చేకూరాలని కోరుకుంటున్నాను” అంటూ విజయ్ తో ఉన్న పిక్ ను షేర్ చేశాడు మహేష్. మరోవైపు నటి, నిర్మాత ఛార్మి కూడా విజయ్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ ట్వీట్ చేసింది. ‘ఒక్కమాటలో చెప్పాలంటే బంగారం… 26 క్యారెట్ల గోల్డ్’ అంటూ విజయ్ దేవరకొండకు కితాబునిచ్చేసింది ఛార్మింగ్ బ్యూటీ. కాగా ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఛార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది.