NTV Telugu Site icon

Baraabar premistha: దసరా బరిలో యాటిట్యూడ్ స్టార్

Cbb

Cbb

Chandrahaas Starrer Baraabar premistha to Release for Dasara: ఈటీవీ ప్రభాకర్ కుమారుడు, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, మేఘన ముఖర్జీ హీరో హీరోయిన్లుగా ఒక సినిమా తెరెక్కుతోంది. Cc క్రియేషన్స్ పతాకంపై సంపత్. వి. రుద్ర దర్శకత్వంలో గెడా చందు ,గాయత్రీ చిన్ని, వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకి ‘ బరాబర్ ప్రేమిస్తా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Niharika: వరద బాధితులకు మెగా డాటర్ విరాళం.. ఎంతంటే?

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ”బరాబర్ ప్రేమిస్తా” చిత్రం ప్యూర్ విలేజ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా నిలుస్తుంది. మా హీరో చంద్రహాస, మేఘనా ముఖర్జీ యూత్ ని ఆకట్టుకునే లవర్స్ గా అద్భుతంగా నటించారు. ఆర్ఆర్ దృవన్ అందించిన సంగీతం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుంది .అలాగే సురేష్ గంగుల మంచి లిరిక్స్ అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుంటూ దసరా కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. మా సినిమాను ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాము. చంద్రహాస్ ,మేఘన ముఖర్జీ, అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, రాజశేఖర్ అనింగి , మధు నందన్, అభయ్ నవీన్, మీసాల లక్ష్మణ్, బతిని కీర్తి లత, సునీత మనోహర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టోరీ: తిరుపతి ఎంఏ, స్క్రీన్ ప్లే: సంపత్. వి . రుద్ర, తిరుపతి,డైలాగ్స్: రమేష్ రాయ్, అందిస్తున్నారు.

Show comments