NTV Telugu Site icon

Chalapathi Rao: నటుడు చలపతిరావు అంత్యక్రియలు పూర్తి

Chalapathi Rao

Chalapathi Rao

Chalapathi Rao: సీనియర్ నటుడు చలపతిరావు అంత్యక్రియలు బుధవారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. ఈ నెల 24న చలపతిరావు మృతి చెందగా, ఆయన కుమార్తెలు విదేశాల్లో ఉండడంతో ఇంతవరకు అంత్యక్రియలు నిర్వహించలేదు. మంగళవారం చలపతిరావు కుమార్తెలు హైదరాబాద్‌ చేరుకున్నారు. అందుకే ఈరోజు ఆయన దహన సంస్కారాలు మహాప్రస్థానంలో జరిగాయి.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చలపతిరావు ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ‘గూఢచారి 116’ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన చలపతిరావు సహాయ నటుడిగా, విలన్‌గా, హాస్యనటుడిగా 1200లకు పైగా చిత్రాల్లో నటించారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ చలపతిరావు వరకు ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో వెండితెరను పంచుకున్నారు. చివరగా బంగార్రాజు సినిమాలో చలపతిరావు నటించారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
YSRCP: గూడూరు వైసీపీలో విభేదాలు.. ఎమ్మెల్యే వరప్రసాదరావుపై అసంతృప్తి

Show comments