కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా రూపొందించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. జిఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్ నిర్మించిన ఈ చిత్రాన్ని పెగళ్లపాటి కౌళిక్ తెరకెక్కించారు. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ గా అనుకున్నంత బాగా ఆడలేకపోయింది. కాగా ఈ సినిమా ఏప్రిల్ 23న ఓటీటీ ఆహాలో విడుదలవుతుంది. ఓటీటీ కోసం ఈ చిత్రాన్ని రీఎడిట్ చేసినట్లు చిత్ర దర్శకుడు కౌశిక్ తెలిపారు. ఆయన అనుకున్న పాయింట్ అంతగా రీచ్ కాలేకపోవటంతో.. ఇంకా బెటర్ గా తీసినట్లుగా దర్శకుడు చెప్పుకొచ్చారు.
చావు కబురు చల్లగా: ఓటీటీ కోసం రీ ఎడిట్
