NTV Telugu Site icon

‘చావు కబురు చల్లగా’తో కార్తికేయ ఖాతాలో కొత్త రికార్డు…!

Chaavu Kaburu Challaga marking 100 million viewing minutes

యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. పెగళ్ళపాటి కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్ నిర్మించాడు. భారీ అంచనాలతో మార్చి 19న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించిన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. కార్తికేయ కెరీర్ లో మరో భారీ ప్లాప్ గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం ఓటిటిలో విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. ఏప్రిల్ 23న ప్రముఖ ఓటిటి సంస్థ ‘ఆహా’లో విడుదలైంది ‘చావు కబురు చల్లగా’. అయితే సినిమా విడుదలకు ముందు ఓటిటి ప్రేక్షకుల కోసం కొంచం రీఎడిట్ చేశారట మేకర్స్. ఇక ఆహాలో ఈ చిత్రం విడుదలైన 72 గంటల్లోనే 100 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ తో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓటిటిలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో కార్తికేయ స్వర్గపురి బండి డ్రైవర్ గా విలక్షణ పాత్ర పోషించారు. మురళీ శర్మ, రావు రమేష్, ఆమని ముఖ్యపాత్రల్లో నటించారు.