తలా అజిత్ తన 50వ పుట్టినరోజును ఈరోజు తన కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక రోజున సహ నటులు, సాంకేతిక నిపుణులు, అభిమానుల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శివకార్తికేయన్, అనిరుధ్ రవిచందర్, హన్సిక, వేదిక, ఆదిలతో పాటు అనేక మంది ప్రముఖులు అజిత్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శివకార్తికేయన్ అజిత్, దర్శకుడు శివలతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసుకున్నారు. అందులో ఓ పిక్ లో అజిత్‌తో కలిసి ఉన్న యువ శివకార్తికేయన్ ను చూడొచ్చు. ఇక అజిత్ హిట్ మూవీస్ కు సంగీతం అందించిన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ‘హ్యాపీ బర్త్ డే డియర్ తల అజిత్ సర్’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా వాస్తవానికి అజిత్ తెలుగువాడే. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అజిత్ ఈరోజు కోలీవుడ్ స్టార్ హీరోగా సత్తా చాటుతున్నాడు. తమిళనాడులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో అజిత్ ఒకరు. ప్రస్తుతం అజిత్ ‘వాలిమై’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. హెచ్ వినోత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు. ఈ పోలీస్ డ్రామాలో హ్యూ మా ఖురేషి, కార్తికేయ గుమ్మకొండ, యోగి బాబు, సుమిత్ర ముఖ్యమైన పాత్రల్లో నటించారు.
అజిత్ కు ప్రముఖుల బర్త్ డే విషెస్
