లెజెండరీ ఇండియన్ స్ప్రింటర్, అథ్లెట్ మిల్కా సింగ్ కోవిడ్ -19 సమస్యల కారణంగా ఈరోజు కన్నుమూసిన విషయం తెలిసిందే. ‘ది ఫ్లయింగ్ సిఖ్’గా పేరొందిన మిల్కా సింగ్ మృతి అందరినీ కలచి వేస్తోంది. ఆయన వయసు 91 సంవత్సరాలు. మిల్ఖా సింగ్‌ను చండీఘర్ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో చేర్పించారు.
Also Read : ఫ్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్ కన్నుమూత
దాదాపు నెలరోజుల పాటు కరోనాతో పోరాడిన ఆయన నేడు తుది శ్వాస విడిచారు. ఆయన భార్య నిర్మల్ కౌర్ కూడా మొహాలిలో కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించారు. ఆమె చనిపోయిన వారం రోజుల లోపే మిల్ఖా సింగ్ కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం అందరినీ దుఃఖంలో ముంచేస్తోంది. సోషల్ మీడియాలో సినీ, రాజకీయ ప్రముఖులు మిల్ఖా సింగ్ కు నివాళులు అర్పిస్తున్నారు. అందరి గుండెల్లో మిల్ఖా సింగ్ ఎప్పటికీ రియల్ హీరోగానే ఉంటారు. ఇప్పటి, రాబోయే తరాలకు ఈ లెజెండ్ జీవితం స్ఫూర్తిదాయంగా నిలుస్తుంది.