Site icon NTV Telugu

N.E.S.T: సినీ సెలబ్రిటీల కోసం క్రైమ్ థ్రిల్లర్ ‘N.E.S.T.’ స్పెషల్ ప్రీమియర్

Nest Movie

Nest Movie

Celebrities Heap Praises N.E.S.T Movie : యునైటెడ్ స్టేట్స్‌లోని చాలా ప్రదేశాలలో ఎన్.ఇ.ఎస్.టి. (N.E.S.T.) చిత్రాన్ని షూట్ చేయగా ఇంగ్లీషులో తీసిన ఈ చిత్రాన్ని ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల కోసం డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఫణి శివరాజు, మణి శశాంక్ కొలిశెట్టి, పులి ధరణి ప్రధాన పాత్రలు పోషించారు. శరత్ సింగం దర్శకుడిగా పరిచయవుతున్న ఈ సినిమా ప్రీమియర్‌ షోను నటుడు అరవింద్ కృష్ణతో సహా పరిశ్రమలోని పలువురు ప్రముఖులకు ప్రత్యేకంగా వేశారు. ఇక ప్రీమియర్ షోలో సినిమాను చూసిన సెలెబ్రిటీలు మూవీ మీద ప్రశంసల వర్షం కురిపించారు.

Swag Teaser: హేయ్ శ్రీవిష్ణు.. నువ్వేనా? ఇదేందయ్యా ఇదీ!

చిత్రం చాలా బాగుందని, సినిమాలో ఆడియెన్స్ అంతా లీనమై చూసేలా ఉందని చెప్పుకొచ్చారు. కథ, స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉందని, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో మూవీని తీసినట్టుగా ఉందని చూసిన వారంతా మెచ్చుకున్నారు. ఫణి శివరాజు, సుదీప్ తానేటి సారథ్యంలోని సినిమాటోగ్రఫీ, భరద్వాజ్ వెంకట ఆర్ఆర్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఫణి శివరాజు, మణి శశాంక్ కొలిశెట్టి, బద్రి కాలేపల్లి, పులి ధరణి, అను రవికుమార్, సంతోషి దామిడి, ప్రసన్న పొన్నాల, సుదీప్ తానేటి, సత్య చలసాని, వినయ్ రెడ్డి కుంట, అభిషేక్ రెడ్డి ఎల్లు, శ్రీపాల్ రెడ్డి, నితిన్ కృష్ణ పులివర్తి, రవికుమార్ పండరి, రవికుమార్ పండరి, రేణు కాలేపల్లి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version