Site icon NTV Telugu

ఇక బాలయ్య ఫ్యాన్స్ కు పండగే…!

CDP To Celebrate Nata Simha Nandamuri Balakrishna's Birthday

నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు అప్పుడే మొదలైపోయాయి. జూన్ 10న ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా బాలయ్య నటిస్తున్న “అఖండ” సినిమా నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేసి నందమూరి అభిమానులకు ఒకరోజు ముందుగానే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం #HappyBirthdayNBK, #AkhandaBirthdayRoar అనే హ్యాష్ ట్యాగ్స్ దేశవ్యాప్తంగా ట్విట్టర్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా బాలకృష్ణ బర్త్ డే ను పురస్కరించుకుని కామన్ డి పిని కూడా విడుదల చేశారు. ఈ సీడీపీని యంగ్ హీరో నారా రోహిత్ విడుదల చేశాడు. ఈ కామన్ డిపి బాలకృష్ణ మామ పుట్టిన రోజున సందర్భంగా లాంచ్ చేస్తున్నందుకు చాలా గర్విస్తున్నానని నారా రోహిత్ చెప్పుకొచ్చారు. ఇక సీడీపీ బ్యాక్ గ్రౌండ్ లో సింహం గాండ్రింపు, అలాగే ఒక రాజ మహల్ లాంటి కోట బాలకృష్ణ సంతకం కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సీడీపీని వైరల్ చేసే పనిలో పడ్డారు నందమూరి అభిమానులు. ప్రతి ఏడాది నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా సెలెబ్రేట్ చేసేవారు అభిమానులు. కానీ ఈసారి మాత్రం కరోనా కారణంగా వేడుకలకు దూరంగా ఉండాలని అభిమానులకు సూచించారు బాలకృష్ణ.

Exit mobile version