NTV Telugu Site icon

కంగనా రనౌత్ బాడీగార్డ్ పై రేప్ కేసు నమోదు

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బాడీగార్డ్ కుమార్ హెగ్డే పై రేప్ కేసు నమోదైంది. ముంబైలోని డిఎన్ నగర్ లో కుమార్ పై రేప్, అన్ నాచురల్ సెక్స్, చీటింగ్ కేసులు నమోదు చేసింది ఓ మహిళ. మే 19న కేసు నమోదు చేసిన ఆ మహిళ కుమార్ హెగ్డే తనను మోసం చేశాడని, చాలాసార్లు లైంగికంగా వేధించాడని, అంతేకాకుండా తన దగ్గర 50 వేల రూపాయలు తీసుకున్నాడని ఆరోపించింది. ఎఫ్ఐఆర్ ప్రకారం… గత సంవత్సరం జూన్ లో 30 ఏళ్ల బ్యూటీషియన్ కు పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చాడు కుమార్. గత కొంతకాలంగా వీళ్ళిద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా తాము ఒకరికొకరు తెలుసని, అయినప్పటికీ తాను ఫిజికల్ రిలేషన్ షిప్ కి ఒప్పుకోలేదని, కానీ కుమార్ తనను ఫోర్స్ చేశాడని బాధితురాలు వెల్లడించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ 376, 377, 420 ప్రకారం కేసు నమోదు చేసుకొని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ప్రస్తుతం విషయం బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.