దేశముదురు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ హన్సిక.. ఆ తరువాత అవకాశాలు బాగానే వచ్చిన హిట్ సినిమాలు అందుకోవడంలో కాస్త వెనుకబడిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ సినిమాలో బిజీగా హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం హన్సిక మాజీ ప్రేమికుడు శింబుతో కలిసి ‘మహా‘ సినిమా చేస్తోంది. అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్దమవుతున్న తరుణంలో ఈ చిత్ర దర్శకుడు జమీల్ కేసు వేశాడు. సినిమాలో కొంత భాగాన్ని తనకు తెలియకుండా అసిస్టెంట్ డైరెక్టర్ తో కంప్లీట్ చేసారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాదు, ఎడిటింగ్ కూడా తన ప్రమేయం లేకుండా జరిగిందన్నాడు. అలాగే తన రెమ్యునరేషన్ కూడా చెల్లించలేదని జమీల్ మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు.
హన్సిక సినిమాపై కేసు.. డైరెక్టర్ లేకుండా ఆ పని చేశారట
