NTV Telugu Site icon

దాసరి నారాయణరావు కొడుకులపై కేసు

Case filed against Dasari Narayana Rao Sons

సినీ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు కొడుకులపై తాజాగా పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాల్లోకి వెళ్తే… 2012లో దాసరి నారాయణరావు రెండు కోట్ల పది లక్షల అప్పు తీసుకున్నారు. ఆ అప్పును తిరిగి చెల్లించకుండానే 2018 నవంబర్ 13న దాసరి నారాయణ రావు కన్నుమూశారు. దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తులు ఈ విషయాన్ని దాసరి కొడుకుల వద్ద ప్రస్తావించారు.

Read Also : శంకర్, చరణ్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్

పెద్ద మనుషుల సమక్షంలో ఆయన కుమారులు అరుణ్, ప్రభు అప్పు చెల్లిస్తామంటూ మాట ఇచ్చారు. రెండు కోట్ల పది లక్షలకు గానూ కోటి 15 లక్షలు ఇస్తామని ఒప్పుకున్నారు. అనంతరం దాసరి నారాయణరావు తీసుకున్న అప్పును చెల్లిస్తామని చెప్పిన కొడుకులు మొహం చాటేశారు. ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని అప్పు ఇచ్చిన సదరు వ్యక్తులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి పేరు సోమశేఖర్ అని తెలుస్తోంది.