NTV Telugu Site icon

Allu Arjun Vs Sukumar: సుక్కూ-బన్నీ గడ్డం వివాదం.. బయటపెట్టిన బన్నీ వాసు

Allu Arjun Vs Sukumar Bunny Vasu

Allu Arjun Vs Sukumar Bunny Vasu

Bunny Vasu Reveals Issue about Allu Arjun Vs Sukumar: గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ -సుకుమార్ మధ్య వివాదం గురించి అనేక రకాల వార్తలు తెర మీదకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అదేమీ లేదని బన్నీ టీంతో పాటు మైత్రి మూవీ మేకర్స్ కి చెందిన సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా ఇదే విషయం మీద బన్నీకి సన్నిహితులు, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నిర్మాతగా వ్యవహరిస్తున్న బన్నీ వాసు అసలేం జరిగిందనే విషయం మీద క్లారిటీ ఇచ్చారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన ఆయ్ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా బన్నీ వాసు ఈ మేరకు కామెంట్ చేశారు. నాకు ఈ వార్తలకు సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ నా స్నేహితులు పంపితే చదివాను. లోపల ఏం జరుగుతుంది అనేది బన్నీ, సుకుమార్ తర్వాత నిర్మాతల తర్వాత అత్యంత సన్నిహితంగా ఉండే నాకే తెలుసు. మేమైతే ఆ ఆర్టికల్ చూసుకుని నవ్వుకునే పరిస్థితిలోనే ఉన్నాం.

Allu Aravind: మీ బామ్మర్దితో సినిమా చేస్తున్నామని ఎన్టీఆర్ కి ఫోన్.. షాకింగ్ సమాధానం!

మాకు పబ్లిసిటీ బాగా వస్తుంది ,ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది కాబట్టి అలా కానిద్దామనే ఉంది. కానీ అసలు విషయం ఏంటి అనేది ఆయన వివరించారు. ఇంకా బన్నీ గారి షూటింగ్ పార్ట్ చాలా తక్కువ ఉంది. 15 రోజులు మాత్రమే షూట్ చేయాలి. ఒక సాంగ్ చేయాలి. ప్రస్తుతానికి ఫహాద్ ఫాజిల్ కి ఎక్కువ వర్క్ ఉంది. ఆయన డేట్స్ క్లాష్ కావడం వల్ల ఎక్కువ వర్క్ ఆయనదే మిగిలింది. బన్నీ గారిది 15 నుంచి 17 రోజులు మాత్రమే షూటింగ్ మిగిలి ఉంది. సుకుమార్ ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నారు. ఎందుకంటే క్లైమాక్స్ అంతా షూట్ చేసిన తర్వాత అప్పుడు గడ్డం తీస్తే ఇబ్బంది అవుతుందని ముందు ఎడిటింగ్ చేస్తున్నారు. ఎక్కడైనా లింకులు మిస్ అయితే షూట్ చేయాల్సి వస్తే సాంగ్ తో పాటే షూటింగ్ పెట్టుకుందామని ఆయన అనుకున్నారు. ఎడిటింగ్ అంటే 30 35 రోజులు గ్యాప్ ఉంటుంది. మధ్యలో ఫహాద్ ఫాజిల్ తో షూట్ చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి.

అలా 30- 35 రోజులు గ్యాప్ ఉన్నప్పుడు బన్నీ తన ఫ్యామిలీతో వెళ్లడానికి లెక్క వేసుకుని వన్ మంత్ లో మళ్ళీ గడ్డం వచ్చేటట్టు గీసుకున్నాడు. దాన్ని అసలు మీరు బీభత్సం చేసి రాసుకొచ్చారు. ఎవరే అనుకున్నా ఇది ఫ్యాక్ట్. సుక్కు అనే అతను అల్లు అర్జున్ కెరీర్ లో కానీ నా కెరీర్ లో గాని ఆయనతో ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది. అల్లు అర్జున్ గారికి సుకుమార్ గారికి ఇద్దరికీ పుష్ప అనేది ఎంత స్పెషల్ అనేది వాళ్లకు మాత్రమే తెలుసు. సుకుమార్ మరో ఆరు నెలలు షూటింగ్ చేస్తాను అన్నా బన్నీ మళ్ళీ వెళతారు. పుష్ప అనేది వాళ్ళిద్దరి లైఫ్ లో ఎంత రిమార్క్ అనేది బాగా తెలుసు. పుష్ప అనే ప్రాజెక్టు వాల్యూ తెలియకుండా ఇంత దూరం వాళ్ళు ట్రావెల్ చేయరు. వాళ్ళిద్దరూ ఏమీ చిన్న పిల్లలు కాదు కదా. ఇప్పుడు వస్తున్న వార్తలన్నీ రాసుకోవడానికి బాగుంటుంది తప్ప అంతకు మించి ఏమీ లేదు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవు, వాళ్ళు వాళ్ళ పనుల్లో ఉన్నారు. షూటింగ్ కూడా ఆగస్టు మొదటి వారంలో ఒక షెడ్యూల్ మొదలవుతుంది. మేము ఎవరి పనులలో వాళ్ళం బిజీగా ఉన్నాం మీరే ఏదేదో ఊహించుకుని రాసుకుంటున్నారు అని సమాధానం ఇచ్చారు.

Show comments