అల్లు అర్జున్‌కి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న బన్నీ వాసు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అనే విషయం కూడా అందరికీ తెలుసు. అయితే, అల్లు అర్జున్ మొదటి హిట్ సినిమా ‘ఆర్య’తోనే ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా మారారు. తాను డిస్ట్రిబ్యూటర్‌గా మారడం వెనుక అసలు కారణం అల్లు అర్జున్ అని ఆయన చెప్పుకొచ్చారు. తనను ‘ఆర్య’ సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్జున్‌కి, నిర్మాత దిల్ రాజుకు మధ్య కోఆర్డినేషన్ కోసం నియమించారని, ఆ సమయంలో తనకు దిల్ రాజుతో పాటు సుకుమార్‌తో కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని అన్నారు. అయితే, ఒక రోజు మాటల మధ్యలో అల్లు అర్జున్, ‘ఆర్య’ సినిమా వెస్ట్ గోదావరి హక్కులు మాకు ఇవ్వమని దిల్ రాజుకి రికమెండ్ చేశారు.
Also Read:Bunny Vasu : ఉదయ్ శ్రీనివాస్ బన్నీ వాసు ఎలా అయ్యాడంటే?
నేను వెళితే, ముందు ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర హైర్స్ మాట్లాడమని అన్నారు. ఆయన బాగా ఎక్కువ రేటు చెప్పడంతో, మళ్లీ దిల్ రాజు దగ్గరికి వెళ్లాను. దిల్ రాజు, “సరే, ఆయనకి ఇవ్వకుండా మొత్తం బిజినెస్ అంతా నువ్వే చేసుకో” అని అనడంతో, “సరేనా” అన్నాను. కానీ, అప్పుడు ఆయనకి టోకెన్ అమౌంట్ ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు. జేబులు మొత్తం వెతికితే 45 రూపాయలు బయటపడ్డాయి. అవే ఇచ్చి, మిగతావి తర్వాత ఇస్తానని చెప్పి వచ్చాను. ఆ తర్వాత, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ దగ్గర నుంచి 5000 తీసుకుని దిల్ రాజుకి ఫస్ట్ అడ్వాన్స్ పంపించాను. ఆ సమయంలో అల్లు అరవింద్ గారి భార్య దగ్గర కూడా నేను డబ్బులు తీసుకున్నాను. ఇప్పటికీ ఆ డబ్బులు ఎవరికీ వెనక్కి ఇవ్వలేదని ఆయన చెప్పుకొచ్చాడు.
