Site icon NTV Telugu

Bunny Vasu : 3డీ యానిమేటర్ వాసు, బన్నీకి రైట్ హ్యాండ్ ఎలా అయ్యాడంటే?

Bunny Vasu

Bunny Vasu

నిజానికి అల్లు అర్జున్ సన్నిహితుడిగా బన్నీ వాసు అందరికీ తెలుసు. అయితే, అసలు బన్నీ వాసు ముందు అల్లు అర్జున్‌కి ఎలా క్లోజ్ అయ్యాడనే విషయం గురించి పెద్దగా తెలియదు. తాజాగా ‘పాడ్‌కాస్ట్ విత్ ఎన్టీవీ’ షోలో ఈ విషయాన్ని బన్నీ వాసు వెల్లడించాడు. నిజానికి, అల్లు అర్జున్ కంటే ముందు డైరెక్టర్ మారుతితో తాను ఫ్రెండ్స్ అని అన్నాడు. మారుతి టు డి అనిమేటర్ కాగా, తాను 3డి అనిమేటర్‌ని అని చెప్పుకొచ్చాడు.

Also Read:Bunny Vasu : షాకింగ్.. 45 రూపాయలతో డిస్ట్రిబ్యూటరయిన బన్నీ వాసు

ఒకానొక సందర్భంలో ‘జానీ’ సినిమాకి సంబంధించిన మర్చండైజ్ విషయంలో తమను అల్లు అరవింద్ గారు పిలిపించారని, ఆ సమయంలో తన మరో స్నేహితుడి ద్వారా అల్లు అర్జున్ అన్న బాబీతో పరిచయం ఏర్పడిందని అన్నారు. అప్పుడే ‘గంగోత్రి’ సినిమా రిలీజ్‌కి నాలుగైదు నెలలు ఉండగా బాబీ “మా తమ్ముడు విషయాలన్నీ చూసుకోవడానికి ఒక మంచి మనిషి కావాలి. నేనైతే నీ పేరే సజెస్ట్ చేశాను” అని చెప్పానని అన్నారు. అయితే, అప్పటికి నేను 3డి అనిమేటర్‌గా మంచి జీవితం తీసుకుంటున్నాను. కాకపోతే, బన్నీ లాంటి మంచి మనిషితో కలిసి పని చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో, ఏమీ ఆలోచించకుండా రంగంలోకి దిగేసాను. అలా 3డి అనిమేటర్‌నైన నేను, తర్వాతి కాలంలో బన్నీ వాసుగా, ఇప్పుడు నిర్మాత స్థాయికి వచ్చానని ఆయన చెప్పుకొచ్చాడు.

Exit mobile version