NTV Telugu Site icon

Tollywood: 1000 కోట్ల సినిమాకి..ప్రొడ్యూసర్ కు వచ్చేదెంత?

Tollywood

Tollywood

ఒక సినిమా 1000 కోట్లు కలెక్షన్లు సాధిస్తే అందులో 400 కోట్లు మాత్రమే నిర్మాతకు దక్కుతాయన్నారు నిర్మాత బన్నీ వాసు. నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా తండేల్ అనే సినిమా రూపొందించారు. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో రూపొందించారు. ఫిబ్రవరి 7వ తేదీన తెలుగు సహా తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే బన్నీ వాసు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

W/O Anirvesh: చిత్ర బృందాన్ని అభినందించిన అల్లరి నరేష్.

తాజాగా ఎన్టీవీ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన కలెక్షన్స్ వస్తే నిర్మాతకు వెళ్ళిపోతాయని అందరూ అనుకుంటారు కానీ అది నిజం కాదని అన్నారు. ఒక సినిమా వెయ్యి కోట్లు కలెక్షన్లు సాధిస్తే అందులో 400 కోట్లు మాత్రమే నిర్మాతకు దక్కుతాయని మిగతావన్నీ థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు, గవర్నమెంట్ కి టాక్స్ ల ద్వారా వెళ్ళిపోతాయని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఒక్కొక్క మల్టీప్లెక్స్ లలో తమకు 34 రూపాయల కంటే తక్కువ వంద రూపాయల్లో మిగులుతుందని చెప్పుకొచ్చారు. సింగిల్ థియేటర్లు తగ్గిపోతున్నాయి. కొన్ని చోట్ల థియేటర్లో మూసేస్తున్నారు. మల్టీప్లెక్స్ కల్చర్ పెరిగిపోతుంది. మల్టీప్లెక్స్ లలో మాకు మార్జిన్ ఏమాత్రం పెద్దగా మిగలదంటూ ఆయన కామెంట్స్ చేశారు.