సంధ్య థియేటర్ అంశం విషయంలో అల్లు అర్జున్ కి కొన్ని తప్పుడు సలహాలు ఇచ్చారు కాబట్టి విషయం చాలా దూరం వెళ్ళింది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ విషయం మీద బన్నీ వర్సెస్ స్పందించాడు. తాజాగా తండేల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ ప్రశ్న ఎదురయింది. నిజానికి ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ గారి అంశం గురించి మాట్లాడడానికి ఇది కరెక్ట్ ప్లేస్ కాదు అన్నారు. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ గురించి కానీ అల్లు అర్జున్ గారి గురించి గానీ ఇక్కడ మాట్లాడను అని అన్నారు. అయితే ఆయన చుట్టుపక్కల ఉండేవాళ్లు ఆయనకు తప్పుడు సలహాలు ఇచ్చారు అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది అది జనాల్లోకి కూడా వెళ్ళింది కదా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా అక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటి? అక్కడ ఏం జరిగింది అనే విషయం మీద డీప్ డిస్కషన్స్ జరిగాయి.
Bunny Vasu: పవన్ కళ్యాణ్ ఒకసారి పక్కన పెడితే కష్టం.. బన్నీ వాసు కీలక వ్యాఖ్యలు!
మా అందరి మధ్య జరిగిన ఈ డిస్కషన్స్ కారణంగా మాకు కొంత క్లారిటీ ఉంది. ఇప్పుడు ఆ విషయాలన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి, అవన్నీ తేలిన తర్వాత ఈ విషయం మీద నేను మాట్లాడతాను. అలాగే నిన్న ఫంక్షన్ కి కూడా అల్లు అర్జున్ గారు ఎందుకు రాలేదనే విషయం మీద నాకు అవగాహన లేదు. అల్లు అర్జున్ గారు ఆరోగ్య సమస్యల వల్ల రాలేదని అల్లు అరవింద్ గారు అన్నారు. కానీ నేనైతే పర్సనల్ గా మాట్లాడలేదు ఆయనకు ఏం జరిగిందో ఏమిటో ఈ హడావిడి కాస్త తగ్గిన తర్వాత వెళ్లి మాట్లాడతానని బన్నీ వాసు అన్నారు.