NTV Telugu Site icon

Bunny Vasu: కేసు ఫైల్‌ అయితే, వెనక్కి తీసుకోలేము..జాగ్రత్త !

Bunny Vas

Bunny Vas

తండేల్ సినిమా పైరసీ గురించి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బన్నీవాసు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ మునుపటిలా పైరసీ లేదని అన్నారు. గత రెండేళ్ల నుంచి పైరసీ నియంత్రణలోకి వచ్చిందని పేర్కొన్న ఆయన ‘గీత గోవిందం’ సమయంలో తీసుకున్న కఠిన చర్యలు కారణంగా తరువాతి కాలంలో చాలా వరకూ పైరసీ తగ్గిందని అన్నారు. అన్ని భాషలతో పోలిస్తే, తెలుగులో పైరసీని చాలా వరకూ నియంత్రించామని అన్నారు. తండేల్ అనే ఈ సినిమా మా అందరి కష్టం, రెండేళ్లు ఎంతో శ్రమించాం అని అన్నారు. సినిమా విజయం సాధించి, ఆస్వాదించే సమయంలో ఇలా పైరసీ జరిగిందని తెలిసి షాక్ కి గురయ్యామని అన్నారు. సోమవారం నుంచి టికెట్‌ రేట్లు తగ్గించాలని అల్లు అరవింద్‌ సూచించారని, అందుకు తగినట్లు చాలా థియేటర్స్‌లో టికెట్‌ ధరలు తగ్గించామని అన్నారు. పైరసీ విషయంలో కొంతమంది తెలిసి, మరికొంత మందికి తెలియక ఇలాంటి పనులు చేస్తున్నారు.

Allu Aravind : తండేల్ పైరసీ.. అరెస్ట్‌ చేయిస్తాం.. గ్రూప్ అడ్మిన్స్ కి అల్లు అరవింద్ హెచ్చరిక

క్రిమినల్‌ కేసు ఫైల్‌ అయితే, వెనక్కి తీసుకోలేము, గీత గోవిందం టైంలో పెట్టిన కేసులకు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అని అన్నారు. యువత ఇందులో చిక్కుకోవద్దన్న ఆయన ఈరోజు ఉన్న టెక్నాలజీతో ప్రతిదీ ట్రాక్‌ చేయొచ్చన్నారు. ఇది అంతా ఒక ఎత్తు అయితే ఆర్టీసీ బస్సులో సినిమాను ప్రదర్శించడం మమ్మల్ని మరింత బాధించిందన్నారు. ఈ పైరసీలో మొదటి బాధితుడు పవన్‌కల్యాణ్‌ దృష్టికీ విషయాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను. అక్కినేని అభిమానులు , ఇతర సినీ అభిమానులు , ‘తండేల్’ పైరసీ చూస్తున్న వారి గురించి వీడియో చేసి 9573225069 నెంబర్ కు మెసేజ్ చేయండి. సాక్ష్యాలు ఉంటే, కచ్చితంగా న్యాయపోరాటం చేస్తాం’’ అని ఆయన అన్నారు.