NTV Telugu Site icon

Aay: ఆయ్ సినిమాలో వాలంటీర్ల ప్రస్తావన.. బన్నీ వాసు ఏమన్నారంటే?

Bunny Vas

Bunny Vas

Bunny Vas Responds on Volunteers in Aay: ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నయన్ సారిక హీరోయిన్గా తెరకెక్కిన తాజా చిత్రం ఆయ్. గోదావరి జిల్లాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 16వ తేదీ రిలీజ్ అయింది. ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు విద్యా కొప్పినీడి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సీజన్లో రిలీజ్ అయిన సినిమాలలో ఈ సినిమాకి మంచి టాకు లభించింది. అయితే ఈ నేపథ్యంలోనే బన్నీ వాసు మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా సినిమాలో వాలంటీర్ల ప్రస్తావన గురించి ఆయనకు ప్రశ్న ఎదురయింది.

Lakshya Sen: వచ్చేసారి పతకం సాధిస్తా.. ప్రధాని మోడీతో లక్ష్యసేన్!

ఇప్పుడైతే అంతా బాగానే ఉంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమా రిలీజ్ అయింది. అయితే వైసీపీ ప్రభుత్వం మరోసారి వచ్చి ఉంటే ఈ విషయంలో ఇబ్బంది పడే వారేమో అని అంటే తాము అసలు అంత ఆలోచించలేదని అన్నారు. ఈ సినిమా కథ రెండు మూడు ఏళ్ల క్రితమే రాసుకున్నారు. అప్పుడే వాలంటీర్ల ప్రస్తావన కూడా రాసుకున్నారు. అయినా అందులో వాళ్లను తప్పుగా ఏమీ చూపించలేదు, కాబట్టి మాకు ఇబ్బంది ఉండదని అనుకున్నాం అని బన్నీ వాసు చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో హీరో స్నేహితులలో ఒకరిగా నటించినా అంకిత్ వాలంటీర్ గా కనిపిస్తాడు. అలాగే మరో వాలంటీర్ గా బిగ్ బాస్ ఫేమ్ సరయు రాయ్ కనిపిస్తుంది.

Show comments