Buchi Babu Sana : బుచ్చి.. నెక్ట్స్ సినిమా ఎప్పుడు బాబు.. ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడు బుచ్చిబాబు సాన మొదటి సినిమా ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఇక రెండవ సినిమాగా ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పెద్ది సినిమాను డైరెక్ట్ చేసి టాక్ ఆఫ్ టౌన్ గా మారాడు. అయితే ఆశించినంత హిట్ కాకపోవడంతో బుచ్చిపై కాస్త నెగిటివిటి వచ్చింది. అయితే ఇప్పుడు బుచ్చి నెక్ట్స్ ఛాన్స్ ఇచ్చే స్టార్ హీరో ఎవరు.. తదుపరి ప్రాజెక్ట్ ఏంటి.. మళ్లీ స్టార్ హీరోతోనే సినిమా ఉంటుందా అనే విషయాలపై ఫిలిం నగర్ వర్గాల్లో తీవ్రంగా చర్చ సాగుతోంది.
‘ఉప్పెన’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత తన రెండో సినిమా కోసం దాదాపు నాలుగైదేళ్ల సమయం తీసుకున్న బుచ్చిబాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో భారీ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ తర్వాత గ్యాప్ రాకుండా చూడాలని ప్రయత్నిస్తున్నాడు. తాజాగా ఆయన తన మూడో ప్రాజెక్ట్‌పై దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కొత్త సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారీ చిత్రం తర్వాత రాబోతున్న సినిమా కావడంతో కథ వైవిధ్యంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే, ఈ ఏడాదిలోనే తన కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈసారి బుచ్చిబాబు ఏ హీరోతో జతకట్టబోతున్నారు, ఎలాంటి కథతో రాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఓ బడా నిర్మాణ సంస్థ బుచ్చికి రెండు కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చింది. మరి మూడవ సినిమా అదే బ్యానర్ లో చేస్తాడా లేదా అనేది చూడాలి.
Also Read
- DC: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’లో విజయ్ దేవరకొండను తీసుకోవాలనుకున్నారా? అసలు కథ ఇదే!
- YouTube Movies : రూపాయి ఖర్చు లేకుండా.. యూట్యూబ్‌లో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్స్
- Toxic Trailer: యష్ కోసం రూల్స్ బ్రేక్ చేసిన నయనతార.. ఒక్క ఫోన్ కాల్‌తో బెంగళూరుకు!
- Varanasi : సూపర్ స్టార్ బర్త్‌డే స్పెషల్.. వారణాసి 'రుద్ర' ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన రాజమౌళి
తాజావార్తలు
-
Buchi Babu Sana : బుచ్చి.. నెక్ట్స్ సినిమా ఎప్పుడు బాబు.. ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు?
-
Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Bajaj Pulsar: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? 2001 నాటి 150cc నుంచి కొత్త N160 4V వరకు పూర్తి చరిత్ర ఇదే!
-
DC: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’లో విజయ్ దేవరకొండను తీసుకోవాలనుకున్నారా? అసలు కథ ఇదే!
-
YouTube Movies : రూపాయి ఖర్చు లేకుండా.. యూట్యూబ్‌లో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్స్
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!