Site icon NTV Telugu

Tollywood : పెద్ది vs లెనిన్.. విడుదల తేదీల గందరగోళం.. అఖిల్ పరిస్థితేంటి?

Tollywood

Tollywood

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విడుదల తేదీల లెక్కలు మారుతున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం వాయిదా పడటంతో ఇతర సినిమాల షెడ్యూల్స్‌పై ఆ ప్రభావం గట్టిగా పడుతోంది. ముఖ్యంగా యంగ్ హీరో అఖిల్ నటిస్తున్నలెనిన్చిత్ర యూనిట్ ఇప్పుడు డైలమాలో పడినట్లు తెలుస్తోంది.

 Also Read : SKN : పెద్ది రిలీజ్ డేట్ కాంట్రవర్సల్ కామెంట్స్ పై SKN వివరణ

నిజానికి ‘లెనిన్’ సినిమాను మే 1వ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం ముందుగా భావించింది. అయితే ఏప్రిల్ 30న రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల కాబోతుండటంతో, ఆ భారీ చిత్రంతో పోటీ ఎందుకని ‘లెనిన్’ మేకర్స్ తమ సినిమాను జూన్ 26కు వాయిదా వేశారు. ఒక పెద్ద సినిమాతో క్లాష్ లేకుండా సేఫ్ డేట్ కోసం వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్విస్ట్ ఏంటంటే.. ఇప్పుడు రామ్ చరణ్ ‘పెద్ది’ కూడా వాయిదా పడి  జూన్ 25వ తేదీనే విడుదలకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే ‘లెనిన్’ టీమ్ ఏ పోటీని వద్దనుకుని వెనక్కి తగ్గిందో, ఇప్పుడు అదే సినిమాతో మళ్లీ తలపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం ఒక్క రోజు వ్యవధిలో ఈ రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామంతో ‘లెనిన్’ టీమ్ పునరాలోచనలో పడింది. ‘పెద్ది’ వంటి పాన్ ఇండియా సినిమాతో పోటీ పడటం రిస్క్ అని భావిస్తే, సినిమాను మరికొంత కాలం వాయిదా వేస్తారా? లేదా అంతకంటే ముందే అంటే ‘ప్రిపోన్’ చేసి ప్రేక్షకు ముందుకు తీసుకువస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై లెనిన్ నిర్మాతల నుండి త్వరలోనే క్లారిటీ  ఇస్తారేమో చూడాలి.

Exit mobile version