Site icon NTV Telugu

Boom Boom : బూమ్ ‘బూమ్ బూమ్’ అంటున్న అర్జున్ అంబటి

Parama

Parama

అర్ధనారి, తెప్ప సముద్రం, వెడ్డింగ్ డైరీస్ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో హీరోగా నటించి ప్రేక్షకులను అలరించిన అర్జున్ అంబటి, ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా సుపరిచితుడయ్యాడు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘పరమపద సోపానం’. ఈ సినిమాలో జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తుంది. ‘ఎస్.ఎస్.మీడియా’ సంస్థ బ్యానర్‌పై గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో, గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మాతగా, గుడిమిట్ల ఈశ్వర్ సహ నిర్మాతగా వ్యవహరించారు.

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాగ శివ, ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. మాస్ మహారాజ్ రవితేజ ‘ఈగల్’ వంటి భారీ బడ్జెట్ చిత్రంతో సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందిన డేవ్ జాండ్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. ‘పరమపద సోపానం’ జూలై 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవల ప్రమోషన్స్‌ను కూడా ఆరంభించారు. ఈ క్రమంలో విడుదల తేదీ పోస్టర్‌తో పాటు, ‘చిన్ని చిన్ని తప్పులేవో’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ రెండూ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టాయి.

ముఖ్యంగా ‘చిన్ని చిన్ని తప్పులేవో’ పాట వైరల్ అవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ప్రమోషన్స్‌లో భాగంగా, చిత్ర యూనిట్ రెండవ లిరికల్ సాంగ్‌ను కూడా విడుదల చేసింది.’భూమ్ భూమ్’ అనే ఈ ఉత్సాహభరితమైన మాస్ నంబర్‌ను కొద్దిసేపటి క్రితం యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రముఖ గాయని గీతా మాధురి ఈ పాటను ఆలపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “‘పరమపద సోపానం’లో ‘భూమ్ భూమ్’ పాటను పాడాను. నాగ శివ పూరి జగన్నాథ్ గారి వద్ద అసోసియేట్‌గా పలు సినిమాలకు పనిచేశారు. ఇప్పుడు దర్శకుడిగా ‘పరమపద సోపానం’తో మన ముందుకు వస్తున్నారు. ‘భూమ్ భూమ్’ పాటను చాలా ఆనందంగా పాడాను. ఇది చక్కటి స్వింగ్ ఉన్న పాట. ఈ పాట ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది. టీమ్ అందరికీ ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు,” అని అన్నారు.

Exit mobile version