భారత సినీ రంగంలో అతిలోకసుందరి శ్రీదేవి వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్ డెడికేషన్ గురించి ఇప్పటికీ అనేక కథనాలు వినిపిస్తూనే ఉంటాయి. ఆమె అకాల మరణం తర్వాత భర్త బోనీ కపూర్ తరచూ ఆమె జ్ఞాపకాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
Also Read :Teja Sajja : ‘జాతి రత్నాలు’ కథ ఫస్ట్ నా దగ్గరకే వచ్చింది..!
శ్రీదేవి చివరిగా నటించిన చిత్రం “మామ్”. ఈ సినిమా షూటింగ్ సమయంలో జార్జియాలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది అని బోనీ గుర్తు చేసుకున్నారు. షూటింగ్ కోసం హోటల్‌లో బస చేసిన సమయంలో, శ్రీదేవి తన భర్త అయిన బోనీని కూడా గదిలోకి అనుమతించలేదట. దీనిపై బోనీ మాట్లాడుతూ “ఆమె ఆ సమయంలో ‘మామ్’ పాత్రలో పూర్తిగా లీనమైపోయింది. ఆ క్యారెక్టర్ నుంచి ఎలాంటి డైవర్షన్ రావద్దని, అందుకే నన్ను కూడా ఒకే గదిలో ఉండనివ్వలేదు” అని తెలిపారు. శ్రీదేవి తన కెరీర్‌లో ఎంత డెడికేటెడ్‌గా పనిచేసిందో బోనీ వివరించారు. “తెలుగు, మలయాళ డబ్బింగ్ కోసం కూడా ఆమె స్వయంగా వాయిస్ ఇచ్చింది. కానీ తృప్తి పడకపోయి, మలయాళ డబ్బింగ్ ఆర్టిస్టును పక్కన కూర్చోబెట్టుకుని తన లిప్ సింక్ సరైనదో కాదో చెక్ చేసేది” అని ఆయన గుర్తుచేశారు. అంతేకాదు, భాష తెలియకపోవడం వలన బాలీవుడ్‌లో ఇబ్బందులు వస్తాయని భావించిన శ్రీదేవి వెంటనే హిందీ నేర్చుకున్నారని, డబ్బింగ్ థియేటర్‌లో కూడా ఒక టీచర్‌తో ప్రాక్టీస్ చేసేదని చెప్పారు.
“మామ్” సినిమాకు సంగీతం ఇచ్చిన ఏఆర్ రెహమాన్ పారితోషికం చాలా ఎక్కువగా ఉండడంతో, నిర్మాతగా బోనీ కపూర్ కాస్త వెనకడుగు వేయాల్సి వచ్చిందట. అయితే, “ఈ ప్రాజెక్ట్ కోసం రెహమాన్ తప్పనిసరి అని భావించిన శ్రీదేవి, తన ఫీజులో నుంచి 50-70 లక్షల వరకు వదులుకుంది. సినిమా కోసం ఏ త్యాగానికైనా సిద్ధం గా ఉండేది ఆమె” అని బోనీ తెలిపారు. ఇలా శ్రీదేవి తన ప్రతి పాత్రను ఎంత పట్టు, ఎంత కష్టంతో చేసి చూపించిందో బోనీ కపూర్ భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు.
