Site icon NTV Telugu

Bollywood : నా ఫ్యామిలీ జోలికి రావద్దు.. అనురాగ్ కశ్యప్ కామెంట్స్ వైరల్

Anurag Kashyap,apologizes

Anurag Kashyap,apologizes

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ గురించి పరిచయం అక్కర్లేదు. అతని సినిమా విషయం పక్కన పెడితే తన మాటలతో ఎప్పుడు ఏదో ఓ విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఇందులో భాగంగా ఇటీవల ఓ వర్గం పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ‘పూలే’ సినిమా విడుదల సమయంలో ఆయన బ్రాహ్మణుల పై అనుచిత కామెంట్స్ చేశాడు. దీంతో తీవ్ర వివాదం నెలకొంది. అయితే ఈ విషయంపై తాజాగా అనురాగ్ క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఓ నోట్ పంచుకున్నాడు.

Also Read : Pooja Hegde : ఆ ఫీలింగ్ చాలా మిస్ అవుతున్నాను..

‘నా మాటలు కొందరి మనోభావాలు దెబ్బతీశాయి. అందుకుగాను నేను క్షమాపణలు చెబుతున్నా. నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. నా కుమార్తెపై కూడా అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారు. ఆమె కంటే నాకు ఏది ఎక్కువ కాదు. మీమల్ని కామెంట్ చేసింది నేను సో కావాలంటే నన్ను నిందించండి. కానీ, నా కుటుంబాన్ని ఈ వివాదంలోకి తీసుకురావద్దు. మీరు నా నుండి క్షమాపణ కోరారు నేను మీ అందరికీ బహిరంగంగా సారీ చెబుతున్నాను’ అని నోట్ విడుదల చేశారు. ప్రజంట్ ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Exit mobile version