ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా వస్తున్న సినిమా పుష్ప -2. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న రిలీజ్ అయింది. అల్లు అర్జున్ నుండి దాదాపు మూడు సంవత్సరాల తర్వాత విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
Also Read : ManchuFamily : మంచు మనోజ్ ఇంటిని చుట్టుముట్టిన బౌన్సర్లు
కాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాలను మించి హిందీలో కలెక్షన్స్ రాబడుతోంది. మొదటి రోజు పుష్ప – 2 ఏకంగా రూ. 72 కోట్లు కలెక్షన్స్ రాబట్టి తెలుగు సినిమా స్టామినా హిందీ స్టార్ హీరోస్ కు మరోసారి రుచి చూపించింది. ఇక రెండవ రోజు రూ. 59 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది పుష్ప -2. ఇక మూడవ రోజు శనివారం మొదటి రోజు కంటే మరింత ఎక్కువగా రూ. 74 కోట్లు కొల్లగొట్టి ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇక నాలుగవ రోజు ఈ సినిమా ఏకంగా రూ. 86 కోట్లు వసూళ్లు చేసి బాలీవుడ్ ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరిచింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మొదటి రోజు కంటే 4వ ఎక్కువ కలెక్ట్ చేసింది. మొత్తంగా నాలుగురోజులకుగాను రూ. 300 కోట్లు రాబట్టింది. బాలీవుడ్ లో అత్యంత వేగంగా కేవలం 5 రోజుల్లో ఈ ఫీట్ అందుకుంది. రెండవ, మూడవ ప్లేస్ లో షారుక్ ఖాన్ జవాన్ 6. పఠాన్ 7 రోజుల్లో నిలిచాయి.