షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ మూగురు అగ్రహీరోలు ఒకే వేదికపై కనిపించడం చాలా అరుదు. ఇటీవల సౌదీ అరేబియా లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని, తమ స్టార్‌డమ్, సినిమాల అనుభవాలు, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరంగా పంచుకున్నారు. ముందుగా షారుక్ ఖాన్ మాట్లాడుతూ, “మేము ఎప్పుడూ స్టార్లుగా అనుకోలేదు. మాకు ఆ ట్యాగ్ నచ్చదు. ఇంట్లో సాధారణ కుటుంబం లాగా ఉంటాం. మా తల్లిదండ్రులు ఇప్పటికీ నన్ను తిడతారు. కానీ స్టార్ హీరోలుగా ఎలా మారామో వివరించడం కష్టం, సరైన సమయంలో సరైన అవకాశాలు రావడం వల్లే జీవితాలు మారాయి’ అని తెలిపారు.
Also Read : Kantara: Chapter 1: కాంతార విజయం వెనుక రిషబ్ శెట్టి పేరు మార్పు కారణమా..?
సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ, “నాది, ఆమిర్‌ది సినీ నేపథ్య కుటుంబం. కానీ షారుక్ దిల్లీ నుంచి వచ్చాడు. ప్రతిభతోనే అడుగుపెట్టాడు” అన్నారు. షారుక్ స్పందిస్తూ, “సల్మాన్, ఆమిర్ నా కుటుంబమే” అన్నారు. దీనిపై ఆమిర్ జవాబుగా, “షారుక్ ఎందుకు స్టార్ అయ్యాడో ఇప్పుడు అర్థమవుతుందని” అన్నారు. మేము ముగురం ఒకే సినిమాలో నటించాలనేది నా డ్రీమ్ అని షారుక్ తెలిపారు. సల్మాన్ సరదాగా, “మేం ఒకే ప్రాజెక్టు లో నటిస్తే దర్శకులు మమ్మల్ని భరించలేరు” అని అన్నారు. షారుక్ స్టార్‌డమ్ అంటే అభిమానులతో ఉన్న అనుబంధం వల్ల వస్తుందని వివరించారు. “ఆమిర్ చాలా పర్ఫెక్ట్. కచ్చితమైన వ్యక్తి. సల్మాన్ స్వేచ్ఛగా, ఒత్తిడి లేకుండా పనిచేస్తాడు. నేను ఈ రెండింటిని కలిపి పని చేయడానికి ప్రయత్నిస్తాను, కానీ చివరకు మేము ముగ్గురం ఒకటే. ప్రేక్షకులకు వినోదం అందించడం మా విధి. గత 35 ఏళ్లుగా అభిమానులు ఇచ్చిన ప్రేమ, మద్దతుకు ఎప్పటికీ కృతజ్ఞుడను. సల్మాన్, ఆమిర్‌లను గౌరవిస్తాను. వారు స్ఫూర్తిదాయకులు. వీరితో ఒకే వేదికపై కూర్చోవడం నిజంగా సంతోషంగా ఉంది” అన్నారు షారుక్.
