బాలీవుడ్ సూపర్ స్టార్స్ అనీల్ కపూర్, కత్రీనా కైఫ్, సోనాక్షి సిన్హా, అనుపమ్ ఖేర్, శిల్పా శెట్టి, షబానా ఆజ్మీ వంటి వారంతా ఓకే ఈవెంట్ కోసం చేతులు కలిపారు. ‘వ్యాక్స్ ఇండియా నౌ’ పేరుతో జూలై 7న వర్చువల్ మ్యూజిక్ కన్సర్ట్ జరగనుంది. అనురాధా పాలకుర్తి ఫౌండేషన్ నిర్వహిస్తోన్న ఈ సేవా క్యార్యక్రమం దేశంలో ప్రస్తుతం సాగుతోన్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రయకు ఆర్దిక సాయం అందించేందుకు ఉద్దేశించింది…
Read Also : దెయ్యంలా మారి కొరియోగ్రాఫర్ ను భయపెట్టేసిన హీరోయిన్…!
కేవలం బాలీవుడ్ నటులే కాదు సంగీత ప్రధానమైన ఆన్ లైన్ షోలో చాలా మంది గాయనీగాయకులు పాల్గొనబోతున్నారు. ఏఆర్ రెహ్మాన్ మొదలు హాలీవుడ్ నుంచీ లియామ్ నీసన్ వంటి వారు వరకూ అనేక మంది లైవ్ పర్ఫామెన్సెస్ ఇస్తారు. షోలో అత్యంత ప్రధానంగా ‘హమ్ సాథ్ హై’ అనే యాంథమ్ గాయనీగాయకులు ఆలపించనున్నారు. జూలై 7న ఇంటర్నెట్ లో మార్మోగనున్న ఈ గీతానికి వెటరన్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరి సంగీతం సమకూర్చుతారు. ‘వ్యాక్స్ ఇండియా నౌ’ ఆన్ లైన్ చారిటీ మ్యూజికల్ షో ద్వారా వచ్చే డబ్బులు గ్రామీణ భారతదేశంలో టీకా పంపిణీ కోసం వివిధ సేవా సంస్థల ద్వారా వెచ్చిస్తారు…
