NTV Telugu Site icon

Bobby : అభిమానుల కోసం నేను ఎంత కష్టమైనా పడతానన్నారు!

Director Bobby

Director Bobby

బాలకృష్ణ డాకు మహారాజ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు బాబీ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ వాల్తేరు వీరయ్య సినిమా జరుగుతున్నప్పుడు వంశీ నా దగ్గరికి వచ్చి డైరెక్ట్ గా ఒకే ఒక మాట అడిగారు. ఈ సినిమా రిజల్ట్ నాకు సంబంధం లేదు. నేను బాలయ్య బాబు గారితో సినిమా చేయాలి అని మొదలుపెట్టారు, అక్కడి నుంచి ఎప్పుడు గెలిచినా బాలయ్య బాబు గురించే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, సినిమా రిలీజ్ అయిపోయింది. తర్వాత మళ్లీ బాలకృష్ణ గారిని ఒక రోజు కలవాలి మీటింగ్ అని చెప్పారు. నిజానికి అంతకంటే ముందే ఒకరోజు పూరి జగన్నాథ్ కారణంగా ఆయన ఆఫీసులో బాలకృష్ణ గారిని కలిసాను. చాలా కూల్ గా మాట్లాడారు, ఆయన సెన్సాఫ్ హ్యూమర్ ఆరోజే నేను చూశాను. బాలయ్య బాబు గారికి కోపం సీరియస్ గా ఉంటారు అని వినేవాళ్ళం కానీ అన్ స్టాపబుల్ తర్వాత ఆ ఇమేజ్ మారిపోయింది. ఒకరోజు నేను వంశీ కలిసి బాలయ్య బాబు గారిని కలిసాము ఆరోజు నాకు బాబు, బాల లేదా బ్రో అని పిలవమని మూడు ఆప్షన్స్ ఇచ్చారు.

SS Thaman: స్పీకర్లు కాలిపోతే కాలిపోనివ్వండి నాకు సంబంధం లేదు

నేను వెంటనే బాబు అని పిలుస్తానని చెప్పాను, ఆరోజు కథ పూర్తిగా వినలేదు. ఇకమీదట నేను ఇలాగే ఉండబోతున్నాను సినిమా మొత్తం నీతో ఎంత కంఫర్టబుల్ గా ఉంటాను అనేది నాకు రెండు గంటల్లోనే చూపించారు. ఆ సమయంలో నాకు ఆదిత్య 369లో ఒక విజువల్ చూపించారు. అయితే మేము ఆల్రెడీ ఒక ఐడియా అనుకుంటున్నాము దానిమీద ట్రావెల్ అవుతున్నాము. అయితే ఆయన ఎప్పుడూ ఒకటే అనేవారు నాన్నగారి తర్వాత నన్ను అంతగా ప్రేమిస్తున్న అభిమానుల కోసం నేను ఎంత కష్టమైనా పడతాను బాబి అని. కాబట్టి వాళ్ళు ఏం కోరుకుంటారు నా నుంచి వాళ్లకి ఏదైనా నా నుంచి ఇవ్వాలి అంటూ ఆ క్యారెక్టర్ గురించి చెప్పారు. వెంటనే నేను మా టీం తో కూర్చుని వెళుతున్న కథ నుంచి ఆ క్యారెక్టర్ ని ఆ లుక్ లో ఉన్న క్యారెక్టర్ ని ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్ కి దానికన్నా బెస్ట్ ఇవ్వాలని కూర్చుని వర్క్ మొదలుపెట్టాం అని అన్నారు.

Show comments