యాటిట్యూడ్ కా బాప్ విశ్వక్ సేన్ బ్లాక్క్ అండ్ బ్లాక్ లో ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇన్‌స్టాగ్రామ్ లో ఆయన షేర్ చేసిన ఈ పిక్స్ ఇప్పుడు ఆయన అభిమానుల్లో సోషల్ మీడియా పేజీల్లో భారీ సంఖ్యలో షేర్ అవుతున్నాయి. ఈ ఫోటోషూట్ లో విశ్వక్ సేన్ మోకాలి పొడవు కోటు ధరించి, చేతిలో ఆయుధంతో మాస్ లుక్ లో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాడు అభిమానులు ఇష్టంగా ‘మాస్ కా దాస్’ అని పిలుచుకునే ఈ యంగ్ హీరో.
Read Also : భారీ రేటుకు “గని” శాటిలైట్ రైట్స్… ఆ ఓటిటికే సొంతం…!
సాధారణంగా ఎక్కువగా హీరోయిన్ల పిక్స్ వైరల్ అవుతుంటాయి. వారి గ్లామర్ షోతోనే నెటిజన్లను తమవైపుకు తిప్పుకుని హాట్ టాపిక్ గా నిలుస్తారు హీరోయిన్లు. అందాలు ఆరబోసి విపరీతంగా ట్రెండ్ అవుతుంటారు. అయితే హీరోలకు మాత్రం ఇలా వార్తల్లో నిలవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. వారు ఎంతో స్టైలిష్ గా, ట్రెండీగా ఉంటేనో, లేదంటే కండలు తిరిగిన దేహంతో న్యూ బాడీ ట్రాన్సఫార్మేషన్ లోకి మారితేనే తప్ప ఆ ఛాన్స్ ఉండదు. కాగా ప్రస్తుతం విశ్వక్ నటించితన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం “పాగల్”. ఈ చిత్రం పూర్తయ్యాక ఈ యంగ్ హీరో “ఓహ్ మై కడవులే” రీమేక్ చిత్రీకరణను ప్రారంభిస్తాడు.
