Blast Zone : అంచనాలు లేకుండా వచ్చి అదరగొట్టిన యాక్షన్ కింగ్ అర్జున్ ‘బ్లాస్ట్’

Tollywood

Tollywood

యాక్షన్ కింగ్ అర్జున్, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్లాస్ట్’. రిలీజ్ కు ముందు అసలు ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమా రిలీజ్ తర్వాత మాత్ టాక్ తో థియేటర్లలో దూసుకుపోతోంది. అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్స్, అదిరిపోయే మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ సీక్వెన్స్‌లతో  తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలై కేవలం నాలుగు రోజులు మాత్రమే అవుతున్నా వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా ఏకంగా రూ. 21.58 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

 గడచిన ఆదివారం నాడు ఈ చిత్రం ఇండియాలో ఊహించని రేంజ్‌లో  వసూళ్లు రాబట్టింది. శనివారంతో పోలిస్తే ఆదివారం ఏకంగా 32% జంప్‌తో దేశవ్యాప్తంగా రూ. 6 కోట్ల నెట్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. తమిళనాడులో ఈ సినిమా హవా మాములుగా లేదు. వీకెండ్స్ థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. ఇక ఓవర్సీస్  మార్కెట్‌లోనూ బ్లాస్ట్ ఊహించని విదంగా సూపర్ హిట్ టాక్ తో  రూ. 5.55 కోట్ల మార్కును అందుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ‘బ్లాస్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టి శబ్దమే చేస్తోంది. ఇప్పటివరకు తెలుగు వెర్షన్ ద్వారా ఈ సినిమా రూ. 3.09 కోట్లు వసూలు చేసి సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలోని అర్జున్, ప్రీతి ముకుందన్ కాంబినేషన్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్, కరాటే నేపథ్యంలో సాగే ఫ్యామిలీ డ్రామాకు ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కు రప్పిస్తోంది. లాంగ్ రన్ లో మంచి వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది కానీ పెద్ది రాకతో థియేటర్స్ నుండి వెళ్ళిపోనుంది బ్లాస్ట్. కానీ అంచనాలు లేకుండా వచ్చి అదరగొట్టి బయ్యర్స్ కు మంచి లాభలు తెచ్చిపెట్టింది.

×
×
Ad