Blast Zone : అంచనాలు లేకుండా వచ్చి అదరగొట్టిన యాక్షన్ కింగ్ అర్జున్ ‘బ్లాస్ట్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాక్షన్ కింగ్ అర్జున్, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్లాస్ట్’. రిలీజ్ కు ముందు అసలు ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమా రిలీజ్ తర్వాత మాత్ టాక్ తో థియేటర్లలో దూసుకుపోతోంది. అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్స్, అదిరిపోయే మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ సీక్వెన్స్‌లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలై కేవలం నాలుగు రోజులు మాత్రమే అవుతున్నా వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా ఏకంగా రూ. 21.58 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
గడచిన ఆదివారం నాడు ఈ చిత్రం ఇండియాలో ఊహించని రేంజ్లో వసూళ్లు రాబట్టింది. శనివారంతో పోలిస్తే ఆదివారం ఏకంగా 32% జంప్‌తో దేశవ్యాప్తంగా రూ. 6 కోట్ల నెట్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. తమిళనాడులో ఈ సినిమా హవా మాములుగా లేదు. వీకెండ్స్ థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. ఇక ఓవర్సీస్ మార్కెట్లోనూ బ్లాస్ట్ ఊహించని విదంగా సూపర్ హిట్ టాక్ తో రూ. 5.55 కోట్ల మార్కును అందుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ‘బ్లాస్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టి శబ్దమే చేస్తోంది. ఇప్పటివరకు తెలుగు వెర్షన్ ద్వారా ఈ సినిమా రూ. 3.09 కోట్లు వసూలు చేసి సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలోని అర్జున్, ప్రీతి ముకుందన్ కాంబినేషన్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్, కరాటే నేపథ్యంలో సాగే ఫ్యామిలీ డ్రామాకు ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కు రప్పిస్తోంది. లాంగ్ రన్ లో మంచి వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది కానీ పెద్ది రాకతో థియేటర్స్ నుండి వెళ్ళిపోనుంది బ్లాస్ట్. కానీ అంచనాలు లేకుండా వచ్చి అదరగొట్టి బయ్యర్స్ కు మంచి లాభలు తెచ్చిపెట్టింది.
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
తాజావార్తలు
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?