‘బ్లాక్ పాంథర్ : వకాండా ఫరెవర్’ ప్రారంభమైంది…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోస్ట్ అవైటెడ్ సూపర్ హీరో మూవీ “బ్లాక్ పాంథర్” సీక్వెల్ పనులు పారంభమయ్యాయి. ‘బ్లాక్ పాంథర్ : వకాండా ఫరెవర్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రారంభమైనట్టు అధికారికంగా వెల్లడించారు. ప్రసిద్ధ నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ ప్రెసిడెంట్ కెవిన్ ఫెయిజ్ మంగళవారం నుంచి ‘బ్లాక్ పాంథర్ : వకాండా ఫరెవర్’ షూటింగ్ అట్లాంటాలోని పైన్ వుడ్ స్టూడియోలో ప్రారంభమైనట్టు ప్రకటించారు. గతంలో ‘బ్లాక్ పాంథర్’లో హీరో రోల్ పోషించిన దివంగత నటుడు చాడ్విక్ బోస్మాన్ తప్ప మిగిలిన తారాగణమంతా ఇందులో తిరిగి నటించనుంది. బోస్మాన్ నాలుగు సంవత్సరాలు పెద్దప్రేగు కాన్సర్ తో పోరాడి చివరకు 2020 ఆగస్టులో కన్నుమూశారు. అయితే ఇప్పుడు ఈ సీక్వెల్ లో ఆయన పాత్రలో ఎవరు నటించనున్నారో మాత్రం సస్పెన్స్ గా ఉంది.
Read Also : యూఎస్ నుంచి తిరిగొచ్చిన ధనుష్.. నెక్స్ట్ అదే పని…!
Also Read
- Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు విజయవంతంగా పూర్తయిన సర్జరీ
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
మొదటి భాగానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ ర్యాన్ కూగ్లర్ సీక్వెల్ కు కూడా దర్శకత్వం వహించనున్నారు. ‘బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్’ జూలై 8, 2022న రిలీజ్ కానుంది. కాగా ‘బ్లాక్ పాంథర్’ సిరీస్ ఫస్ట్ పార్ట్ ఫిబ్రవరి 2018లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1.34 బిలియన్ డాలర్లు సంపాదించింది. ‘ఎవెంజర్స్’ కాకుండా మార్వెల్ కు అత్యధిక వసూళ్లు తెచ్చిపెట్టిన మూవీగా ‘బ్లాక్ పాంథర్’ నిలిచింది. ఈ చిత్రం ఏడు విభాగాల్లో అకాడమీ అవార్డుకు నామినేట్ కాగా, బ్యాక్ గ్రౌండ్ స్కోరు, కాస్ట్యూమ్ డిజైన్, ప్రొడక్షన్ డిజైన్ కేటగిరీల్లో ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది.
తాజావార్తలు
-
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మృతి.? పాక్ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు..
-
Medigadda Case : మేడిగడ్డ కేసులో మరో ట్విస్ట్.. కేసీఆర్‌కు మళ్లీ సమన్లు..!
-
NEET Case: నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై 20 వేల పేజీల ఛార్జ్‌షీట్
-
Kangana Ranaut: ‘‘నక్కగా ఉండే కన్నా కుక్కగా ఉండటం బెటర్’’ నసీరుద్ధీన్ షాపై కంగనా ఫైర్..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు విజయవంతంగా పూర్తయిన సర్జరీ
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..