Bishnoi gang planned to attack Salman Khan at film shoot: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను ఓ సినిమా షూటింగ్‌లో హత్య చేసేందుకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పథకం వేసినట్టు వెల్లడైంది. సల్మాన్‌ను చంపేందుకు బిష్ణోయ్ స్వయంగా తన ముఠా సభ్యులకు 25 లక్షలు ఇచ్చాడు. ఈ మేరకు సుపారీ ఇచ్చినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురిపై నవీ ముంబై పోలీసులు దాఖలు చేసిన కొత్త ఛార్జ్ షీట్‌లో ఈ విషయం వెల్లడైంది. జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన నిందితులు సల్మాన్ ఖాన్‌ను హతమార్చేందుకు ఆధునిక ఆయుధాలను కొనుగోలు చేయాలని ప్లాన్ చేశారు. 2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాను హత్య చేసేందుకు ఉపయోగించిన టర్కీలో తయారైన జిగానా పిస్టల్‌తో సల్మాన్‌ఖాన్‌ను హత్య చేయాలని బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ చేసింది.
Nani: దసరా రిపీట్స్… నాని మీద 150 కోట్లు?
సల్మాన్ పై దాడి చేసేందుకు ఎం16, ఏకే-47, ఏకే-92 తుపాకులను కొనుగోలు చేసేందుకు పాకిస్థానీ ఆయుధ వ్యాపారితో టచ్‌లో ఉన్నట్లు విచారణలో తేలిందని చార్జిషీట్‌లో పేర్కొంది. కొన్నేళ్ల క్రితం సల్మాన్ ఖాన్ రాజస్థాన్‌లో కృష్ణజింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. కృష్ణజింక బిష్ణోయ్ సామాజిక వర్గానికి గౌరవనీయమైన జంతువు. ఆ జంతువును వారు పవిత్రంగా భావిస్తూ పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ రాజస్థాన్‌లో కృష్ణజింకలను వేటాడినట్లు భావిస్తూ బిష్ణోయ్ సామాజిక వర్గానికి చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ను చంపే ప్లాన్ చేశారు. సల్మాన్ ఇంటిపై కాల్పుల ఘటన అనంతరం ఈ విషయాన్ని ముంబై పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.