NTV Telugu Site icon

లైంగిక వేధింపుల కేసులో నటుడికి విముక్తి

Bill Cosby to be freed after US court quashes sex crimes conviction

ప్రముఖ అమెరికన్ సీనియర్ నటుడు, కమెడియన్ బిల్ కాస్బీకి జైలు నుంచి విముక్తి లభించింది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఆయనపై ఉన్న అభియోగాలను రద్దు చేస్తూ అతన్ని వెంటనే జైలు నుండి విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. పెన్సిల్వేనియా అత్యున్నత న్యాయస్థానం బిల్ కాస్బీ లైంగిక వేధింపుల నేరాన్ని రద్దు చేసింది. అతన్ని బుధవారం జైలు నుండి విడుదల చేయడానికి అనుమతించింది.

Read Also : బ్రిట్నీ ఆరోపణలపై దర్యాప్తు… కోర్టుకు తండ్రి రిక్వెస్ట్

హాలీవుడ్ లో మీటూ ఉద్యమం ఉధృతంగా సాగిన సమయంలో కాస్బిపై చాలామంది లైంగికి వేధింపుల ఆరోపణలు చేశారు. 2004లో ఆండ్రియా కాన్స్టాండ్‌ అనే అమ్మాయికి ఏవో మాత్రలు ఇచ్చి, కాస్బీ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 2018లో ఆయన దోషిగా తేలడంతో న్యాయస్థానం బిల్ కు 3-10 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అయితే ఆయన రెండు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన తరువాత పెన్సిల్వేనియా కోర్టు నిర్ణయంతో బిల్ కాస్బీ పెన్సిల్వేనియాలోని షిప్పాక్‌లోని రాష్ట్ర జైలు నుండి విడుదలయ్యాడు. ఆ తరువాత ఆయన బిల్ ఎల్కిన్స్ పార్క్‌లోని తన స్టాన్లీ రాతి భవనం వద్దకు వచ్చాడు. హాస్యనటుడిగా, నటుడిగా బిల్ కాస్బీ సూపర్ సక్సెస్ అయ్యాడు. ‘ది కాస్బీ షో’లో ఆయన చేసిన ఒక పాత్ర 1980లలో బాగా ప్రాచుర్యం పొందింది. ఆయనకు అభిమానులు “అమెరికా ఫాదర్’ అనే బిరుదును కూడా ఇచ్చేశారు. ఎంటర్టైన్మెంట్ రంగంలో దాదాపు ఐదు దశాబ్దాలుగా నటించి ప్రేక్షకులను మెప్పించిన బిల్ 400 మిలియన్ డాలర్ల సంపదను సంపాదించాడు.